హ్యాబిట్స్ ను కంట్రోల్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ అరికట్టవచ్చు

ఆధునిక యుగంలో అందరూ బిజీ నే. మార్నింగ్ లేవడం టిఫిన్ తినడం ఉరుకులు పరుగులతో ఆఫీస్ లకి చేరడం ఇదే లైఫ్ అయిపోయింది. ఈ క్రమం లో ఆరోగ్యం పట్ల కొంచం అశ్రద్ధ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అలాగే కొంతమందికి బరువు సమస్య, మరికొందరికి  బెల్లీ ఫ్యాట్ సమస్య ఇలా ఎన్నో సమస్యలు. బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడం కొంచెం కష్టమే. పొట్ట ఉదరంలో ఫ్యాట్ చేరడం చాలా సులభం. అయితే దాన్ని కరిగించుకోవడమే చాలా కష్టం. కష్టపడి పొట్ట కరిగిస్తే, అనారోగ్య సమస్యలను నివారించుకోవడంతో పాటు, అందంగా..నాజుగ్గా కనబడుతారు.

స్త్రీ, పురుషులతో సంబంధం లేకుండా చాలామంది  ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడం కోసం చాలా మంది డైట్ , వ్యాయామాలు చేసినా ఫలితం మాత్రం ఎఫెక్టివ్ గా కనబడదు. ఇటువంటి సమయంలో ఏం చేయాలి?
బెల్లీ ఫ్యాట్ సమస్యలు మరింత ఎక్కువ కాకముందే కొన్ని కామన్ హ్యాబిట్స్ ను స్టాప్ చేయాలి. ఈ హ్యాబిట్స్ ను కంట్రోల్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందామా..

భోజనం తినకపోవడం

బెల్లీ ఫ్యాట్ ను మరింత అధ్వాన్నంగా మార్చడంలో టైమ్ టు టైమ్ భోజనం తినకపోవడం. మీల్స్ ను స్కిప్ చేయడం వల్ల మెటబాలిజం రేటు తగ్గుతుంది. ఇలా చేడయం వల్ల తర్వాత భోజనంలో ఎక్కువ ఆహారాలను తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ క్రమంగా పెరుగుతుంది.!

ఫ్రూట్ జ్యూస్ లు తాగడం మానేయాలి

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే, రెగ్యులర్ గా ఫ్రూ జ్యూస్ లు తాగడం మానేయాలి. ఇంకా కొన్ని క్యాలరీలు, స్వీట్స్ వంటి బెల్లీ ఫ్యాట్ కు కారణమవుతాయి. కాబట్టి, కొన్ని హైక్యాలరీ ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి.

ప్రొబయోటిక్స్ లోపం


పెరుగు, యోగర్ట్ వంటి ప్రొబయోటిక్ ఫుడ్స్ ను తినకపోవడం రెగ్యులర్ గా తినకపోవడం వల్ల పొట్ట పెద్దగా పెరుగుతుంది. ప్రొబయోటిక్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీ గౌట్ బ్యాక్టీరియాను పొట్టలో పెంచుతుంది. దాంతో తిన్న ఆహారాలు త్వరగా జీర్ణమయ్యేలా చేసి, బెల్లీ ఫ్యాట్ పెరగడకుండా హెల్తీ బ్యాక్టీరియా సహాయపడుతాయి!

డైట్ ప్లాన్ ఫాలో అవ్వకపోవడం

నేచురల్ గా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే, డైట్ ప్లాన్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్ గా డైట్ ను ఫాలో అవ్వకపోతే, బయట ఆహారాలకు ఎక్కువగా అలవాటు పడుతారు. జంక్ ఫుడ్స్, స్వీట్స్ వంటి ఎక్స్ ట్రా క్యాలరీలున్న ఆహారాలను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.

స్ట్రెస్ తో ఎక్కువ తినడం మానేయాలి


స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఆహారాలను తినడం ఆరోగ్యానికి చాలా హానికరం, అదే విధంగా బెల్లీ ఫ్యాట్ కూడా వేగంగా పెరగుతుుంది. కాబట్టి స్ట్రెన్ ను తగ్గించుకోవడానికి ఇతర మార్గాలు చూసుకోవాలి. క్రమంగా బెల్లీ తగ్గించాలి.!

టీవీ ముందు కూర్చొని భోజనం చేయడం

టీవీ ముందు కూర్చొని భోజనం చేయడం వల్ల మీరు ఎంత క్వాంటిటీ తింటున్నారో మీకే తెలియదు. మోతాదకు మించి తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది.

సోషియల్ మీడియా అడిక్షన్

సోషియల్ మీడియాలో ఎవరైతే బాగా యాక్టివ్ గా ఎక్కువ సమయం గడుపుతుంటారో వారిలో హంగర్ బెల్లీ పెరుగుతుంది. ఎక్కువ గంటలు కూర్చొనే ఉండటం వల్ల బెల్లీ ఎక్కువగా పెరిగిపోతుంది. దీన్ని నివారించుకోవాలంటే, లాంగ్ సిట్టింగ్ అవర్స్ ను తగ్గించాలి. అరకగంటకొకసారి లేచి తిరిగుతుండాలి. స్ట్రెచ్ అవ్వాలి.

0 comments:

Post a Comment