తులసి ప్రయోజనాలు ఎన్నో..


భారత దేశంలో చాలా మంది తులసి మొక్కను దైవంగా భావించి పూజిస్తారు. తులసి ప్రకృతి ప్రసాదించిన వరం మన పెరట్లో దొరికే దివ్యౌషధం. పురాణాల్లో ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. మహాభారత కాలంలో ఘటోత్కచుడు సైతం మోయలేని శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి.  తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో దానిలో ఉన్న ఔషధ గుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

నోటి దుర్వాసన :

కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.

కఫం :

ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.

దగ్గు, జలుబు:

తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.

దగ్గు నుండి ఉపశమనం:

జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.

కళ్ళు మంటలకు:

కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించాలి సుమా..)

జ్వరం తగ్గుటకు :

తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.

గొంతు నొప్పులను తగ్గుటకు:

తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.

నోటి పూత తగ్గుటకు:

తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.

విరేచనాలు అరికట్టుటకు:

తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.

బరువు తగ్గుటకు:

తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది. తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.

నిద్రలేమి సమస్య :

నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

0 comments:

Post a Comment